2 ఫిబ్ర, 2016

రత్నాచల్ ఆత్మాఘోష

రత్నాచల్ ఆత్మాఘోష



ఎవరికి కోపం వచ్చినా మేమే బలవ్వాలా?
మీ తల్లిని ,చెల్లిని అన్నని నాన్నని అందరినీ భుజాల కెక్కించుకొనీ
వేల మైళ్ళు పరుగులుతీస్తూ అలుపెరుగకపయనిస్తామే
మేమేమైనా మీదారికిఅడ్డువచ్చామా,
మీ రిజర్వేషన్లని కాదుపోమ్మన్నామా
క్షణికావేశంలో నన్నునిలువునాకాల్చేసారే
ఇంకానయం నాతొపాటుమీజాతివాళ్ళని తగలబెట్టనందుకు సంతోషం
కానీనీకుతెలియదా నువ్వుకూర్చున్నకొమ్మనువ్వేనరుక్కున్నావని,
నీగొయ్యనువ్వేతవ్వుకున్నావని
అవునులే కడుపుకాలేది పేదవాడికేగా,ఏకులంలో ఉన్నా
స్వతంత్ర భారతమాత డభ్భైఏళ్లప్రాయనికివస్తున్నా
ఇంకా ఏకులాన్నిఎదగనివ్వని మీనీచరాజకీయాలతో
ఇంకా భారతదేశం ఎదగలేదని అనాగరికులని
ప్రపంచానికి చాటిచెప్పాలని అనుకుంటున్నారా?
కోట్లుగడించుకున్న రాజకీయనాయకులకెందుకు రిజర్వేషన్లు
సమైక్యఆంద్రఉద్యమంలో ఏమయ్యాయిమీపౌరుషాలు?
ఎవరికులం కోసం వాళ్ళుపోరాటాలు చేసేబదులు
ప్రత్యేక ప్రతిపత్తికోసం పోరాటం చేయలేరా
ఆర్ధికంగావెనకబడ్డవాడికి రిజర్వేషన్ కల్పించమని పోరాడలేరా
మనసుపెట్టిఆలోచించండి ఎక్కడలేరు వెనకబడినవాళ్ళు
అన్నికులాలలో ఉన్నారుపేదవారు,రండిఅందరూ కలసి
వారికిచేయూతనివ్వండి,రిజర్వేషన్లులేని సమాజాన్నినిర్మించండి
హాయిగాసాఫీగా మాప్రయాణాన్నికొనసాగించనివ్వండి...
నిలువెల్లా కాలిబూడిదయిన మీ రత్నాచల్

8 నవం, 2015

ప్రేమంటే-(5వ భాగం)




ప్రేమంటే-(5వ భాగం)

ఒకరోజు రంగారావు గారు సురేంద్ర ని పిలిపించారు."ఏమిటి మావయ్యా పిలిచారట."అంటూ వచ్చాడు సురేంద్ర.
అవును బాబూ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే పిలిచాను. రా కూర్చో!"అన్నారు.పక్కనే అపర్ణ,భానుమతిగారు కూడ ఉన్నారు.
కాఫీ తాగుతావా?టీ తాగుతావా ?అని భానుమతి గారు అంటే ,మంచి టీ పెట్టు అత్తా,నీ చేత్తో టీ తాగి చాల రోజులయ్యింది అన్నాడు సురేంద్ర."నువ్వు కూర్చో అమ్మా నేను పెడతానులే,ఏం నా చేత్తో పెడితే బాగోదా బావా! అంది అపర్ణ .అలాగనేం కాదు గాని అత్త ఇంకా బాగా పెడుతుంది.సరే నువ్వే పెట్టు,తర్వాత నీతో గొడవ ఎవడు పడతాడు."నవ్వుతూ అన్నాడు సురేంద్ర.నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అపర్ణ
సరే చెప్పండి మామయ్యా ఏదో మాట్లాడాలన్నారు.?అడిగాడు సురేంద్ర
ఏమిలేదు బాబూ! అపర్ణ పెళ్లి విషయం మాట్లాడదామని.నీకు అపర్ణ మీద ఎలాంటి అభిప్రాయం వుందో తెలుసుకుందామని,మీ అత్తయ్య కూడా ఒక సారి అడగ మంది అందుకనే!

మామయ్యా మీకు తెలుసు కదా!మేమిద్దరం చిన్నప్పటినుండి ఎలా పెరిగామో మీకు తెలియందికాదు. నాకైతే తన మీద అభిమానం తప్ప ఇంకే అభిప్రాయం లేదు.తనని కూడా అడగండి.నాకు తెలిసి తను కూడా ఇదే అభిప్రాయం చెపుతుంది.తనకి ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యండి."అన్నాడు సురేంద్ర
"అది సరే మరి నీ సంగతేమిటి? "అడిగారు రంగారావు గారు
"ముందు అపర్ణ పెళ్లి చెయ్యండి మామయ్యా ! తర్వాత ఎవరినైనా చూసి చేసుకుంటాను.అయినా నా పెళ్ళికి ఇప్పుడేమంత తొందరా !" అన్నాడు సురేంద్ర

"అది కాదు బాబూ నువ్వు వొంటరిగా ఉంటున్నావు.ఎంత చెప్పినా ఇక్కడికి వచ్చి వుండవు.నీకు ఒక తోడు ఉంటే బాగుంటుంది.ఎప్పటికైనా చేసుకో వలసిందే కదా "అంది భానుమతి.
"ఔను సురేంద్రా ! ఇంతకీ నిన్ను పిలిపించిన ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే మొన్న వచ్చిన పిల్లల్లో ఒక అమ్మాయి నువ్వంటే చాలా ఇష్ట పడుతోంది.బహుశా నీకు తెలుసనుకుంటా! ఆవిషయం ఆ అమ్మాయి మన అపర్ణతో చెప్పింది.అపర్ణ నాతో చెప్పింది.నేను కూడా ఆ అమ్మాయి తో మాట్లాడాను ....రంగారావు గారు అంటూ ఉండగానే
బావా నీకు తెలియదా ఆ అమ్మాయి ? నా వైపు చూసి చెప్పు అంటూ టీ కప్పులతో వచ్చింది అపర్ణ
"ఏయ్ వెటకారమా! నేనేమైనా చెప్పానా నీతో ! అన్నాడు సురేంద్ర
"నిజం చెప్పు ఆ వచ్చిన అమ్మాయిలలో నీకు బాగా నచ్చిన అమ్మాయి లేదా ! పాపం నీకు వొంట్లో బాగోలేదని నిన్ను చూడ్డానికి కూడా వచ్చింది."అంది అపర్ణ
ఆ అమ్మాయా ! నీల హంస అనుకుంటా! అన్నాడు సురేంద్ర
'చూసావా బావా పేరుకూడా గుర్తుంది.ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయంటే నీకు ఇష్టమేగా !అంది
అమ్మాయి బాగానే ఉంది కానీ నాకంటూ ప్రత్యేకమైన అభిప్రాయం ఏమిలేదు.సరే మామయ్యా మీ రేమంటారో చెప్పండి."అన్నాడు సురేంద్ర
"ఆరోజు ఆ అమ్మాయిని కూర్చో బెట్టి మాట్లాడాను.వాళ్ళది చాలా సంప్రదాయ కుటుంబం .తండ్రి మంచి వ్యాపారవేత్త.ఇద్దరు అమ్మాయిలు.పెద్దమ్మాయికి గత ఏడాదే పెళ్ళయ్యింది.నువ్వు ఇష్ట పడితే పెళ్లి గురించి వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతాను " అన్నారు రంగారావు గారు
సరే మామయ్యా మరి ఆ అమ్మాయి మన పల్లెటూరికి వచ్చి ఉంటుందా ?
"ముందు ఆ అమ్మాయికి ఈ పల్లె మీద ప్రేమ ఏర్పడింది.తర్వాత నీ మీద ప్రేమ ఏర్పడింది.
నిజంగా ఆ అమ్మాయి ఉత్తమురాలు.అందరు ఆడపిల్లలలా ప్రేమ దోమ అంటూ వెమ్పర్లాడకుండా నా తోనే చెప్పింది.మరి నువ్వు ఊ అంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతాను"అన్నారు రంగారావుగారు
ఇంతలో ఇంటి ముందు కారొకటి వచ్చి ఆగింది.ఎవరా అని చూసారు రంగా రావు గారు.
కారులోంచి హుందాగా ఉన్న ఒక వ్యక్తీ ఆయన వెనకాల ఆయన భార్య అనుకుంటా దిగారు.వెనకాలే నీల హంస కూడా దిగింది.అప్పుడు అర్ధమయ్యిందిరంగారావు గారికివచ్చింది ఎవరో! గబగబా పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళింది అపర్ణ.
దొంగ ! ఉండలేకపోయావా! అమ్మని నాన్నని వెంట పెట్టుకు వచ్చావు? అంది అపర్ణ
సిగ్గు పడిపోయింది. "అదేమీ కాదు నాన్న కి రంగారావు అంకుల్ తెలుసుట.అందుకే ఈ రోజు ఆదివారం కదా అని ఇలా వచ్చాము."అంది నీల హంస
అయితే అమ్మకి నాన్నకి చెప్పేసావా?
లేదే ! అంకుల్ కి చెప్పాను కదా ఆయనే కదుపుతారులే! అని నవ్వుతూ అనేసింది.
ఒరేయ్ శ్రీధర్ నువ్వేమిటిరా ఇక్కడ ?అంటూ ఆశ్చర్యపోయారు రంగారావు గారు
"ఇదిగో నా కూతురు పుణ్యమా అని నిన్ను కలిసే అదృష్టం కలిగింది.మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిన సంగతి చెపితే గానీ వాళ్ళు ఈ వూరు వస్తున్నారని తెలియలేదు.బాగున్నావా చెల్లెమ్మా? "అంటూ పలకరించారు శ్రీధర్.
ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించు కుంటూ ఆనంద పడిపోయారు. అప్పుడు పరిచయం చేసారు సురేంద్ర ని ఇతను మా మేనల్లుడు అని రంగారావుగారు.(సశేషం)

1 నవం, 2015

ప్రేమంటే -4 వ భాగం



ప్రేమంటే -4 వ భాగం


నీల హంస మనసు సురేంద్ర చుట్టూ తిరుగుతోంది.కానీ ఒక సందేహం తన మేనమామ కూతురు ఎప్పుడూ అంటి పెట్టుకొనే ఉంటుంది.బహుశా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండే ఉంటుంది.మరి తన ప్రేమని వ్యక్తం చేయడమెలా ?ఇంతలో అపర్ణ వచ్చింది."ఏమిటీ ఒంట్లో బాగులేదట!టిఫిన్ తినలేదా ? " అనిఅడిగింది."అబ్బేఏమీకాదుకొంచెంతలనొప్పిఅంతే! "ఇంతకీసురేంద్రగారికిఎలాఉంది?"అనిఅడిగిందినీలహంస.అవునుజ్వరమటనేనుఆటేవెళ్తున్నానువస్తావా" అనిఅడిగింది.సరేనడువుఅనిబయలుదేరిందినీలహంస..దారిలోమాటలసందర్భంలో అపర్ణతనకిబావకిఉన్నఅనుబంధంగురించిచెప్పింది.చిన్నప్పటినుండి.ఒకేచోటపెరగడంవల్లవాళ్ళమద్యస్నేహంతప్పవేరేభావాలులేవు.ఆమాటవింటూనే"నిజమాఐతేమీరిద్దరూపెళ్లిచేసుకోరా'అనిఎక్సైట్అయిపోతూఅడిగిందినీలహంస.అదేమిటీనువ్వుఅంతఆనందపడిపోతున్నావు?ఏమిటివిశేషం?కన్నుగీటుతూఅడిగిందిఅపర్ణ.


సిగ్గుపడిపోయింది నీలహంస..


"ఎందుకోనిన్నుచూడగానేనాకుమీఇద్దరిజోడీబాగుంటుందనిఅనిపించింది.నాఊహేనిజమయ్యింది.ఇంతకీమాబావకిఆఉద్దేశంఉందోలేదోతెలుసుకోవాలి.సరేఎలాగుఅక్కడికివెళ్తున్నాంకదా చూద్దాం"అండిఅపర్ణ


మౌనంగాఉండిపోయిందినీలహంస.మాటల్లోసురేంద్రఇంటికిచేరుకున్నారు.


బావా! ఓబావా! ఎక్కడున్నావు? అంటూలోపలివెళ్ళిందిఅపర్ణ.వెనకాలేనెమ్మదిగావెళ్ళిందినీలహంస


కూర్చోవస్తున్నాను.అన్నాడుసురేంద్ర.హాల్లోకివస్తూనే నీలహంసనిచూసి ఆశ్చర్యపోయాడు.


'మీరేంటిఇక్కడ? ఫీల్డ్ కివెళ్ళలేదా!" అన్నాడు


'అదోపెద్దహిస్టరీబావా! ఇక్కడనీకుఒంట్లోబాగోకపోతే ఆవిడకిఎలాఉంటుంది?"


ఏంటిఅపర్ణా! ఆమాటలు?తప్పుకదూ!


ఏంకాదుబావా! సరేముందునువ్వుటిఫిన్చెయ్యి.తర్వాతమాట్లాడుకుందాం అందిఅపర్ణ


సరే అనిటిఫిన్పూర్తిచేసాడు.


నీలహంసమాత్రంఅలా సురేంద్రనిచూస్తూనేఉండిపోయింది.


అలామరోరెండురోజులుగడిచాయి.మరుసటిరోజు కాలేజివిద్యార్థులువెళ్ళిపోతారు.


నీలహంసమనసుమాత్రంఅల్లకల్లోలంగాఉంది.ఏమీచెప్పలేకపోతోంది.


ఆరోజుసాయంత్రం రంగారావుగారింట్లోఅందరికీమంచివిందుఏర్పాటుచేసారు.కాలేజ్ ప్రిన్సిపాల్ గారుకూడావచ్చార.విద్యార్థులుసురేంద్రకిరంగారావుగారికికృతజ్ఞతలుచెప్పారు.అంతాకలిపిచాలాఉత్సాహంగాగడిపారుఆరాత్రి.


ఉదయాన్నేవిద్యార్థులంతాబయలుదేరడానికిసిద్ధంగాఉన్నారు.నీలహంసమాత్రందిగాలుగాఉంది. అపర్ణకళ్ళతోటేధైర్యంచెబుతోంది.సురేంద్ర మనసులోకూడాఏదోఅలజడి.చెప్పలేకపోతున్నాడు.


ఇంతలోరంగారావుగారువచ్చారు.అందరికీవీడ్కోలుచెప్పారు.


"అమ్మానీలహంసా ఎందుకమ్మాఅంతదిగులుగాఉన్నావు? ధైర్యంగాఇంటికివెళ్ళు.ముందునీచదువు పూర్తీచెయ్యి. మిగిలినవిషయాలు తరువాత మాట్లాడుకుందాం. అంతామంచేజరుగుతుంది" అన్నారు.అక్కడ ఈవిషయంఅర్ధమైనదిముగ్గురికే.మిగిలినవాళ్ళు అర్ధంకాక అయోమయంగాచూసారు.

వెర్రిచూపులుచూస్తూ నీలహంసబస్సుఎక్కింది.సురేంద్రకూడా ఆమెవంకఅలాచూస్తూఉందిపోయాడు.బస్సుకదిలింది.అందరూ ఉత్సాహంగా చేతులుఊపుతున్నారు.నీలహంసకూడాఅపర్ణకి చేయిఊపుతో ఉందిపోయింది.(సశేషం)

24 అక్టో, 2015

ప్రేమంటే-తరువాయి భాగం -3


ప్రేమంటే-తరువాయి భాగం -3
అబ్బాయిలంతా వాళ్లకి కేటాయించిన రూములకి వెళ్ళారు.ఆడపిల్లలు వాళ్లకి కేటాయించిన అవుట్ హౌస్ కి వెళ్ళారు. వారి వెనకే అపర్ణ కూడా వెళ్ళింది.అప్పటికే ఆ అమ్మాయిలందరూ పరిచయమయిపోయారు."రాధికా ..రాధికా ! మద్యాహ్నం ఫీల్డుకి వెళ్ళేప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటావు ? నేను ఏం వేసుకోనూ ? "అంటూ చిన్న పిల్లలా రాధికని అడిగింది కోటేరు ముక్కు ,తెల్లగా మెరుపు తీగలా ఉన్న ఆ అమ్మాయి.స్వరం కూడా వీణ మీటినట్లుంది.
"అలాగే నీలహంసా ! ఇప్పుడే కదా వచ్చాము ,అయినా నీకేమి కావాలో నువ్వు చూసుకోవచ్చు కదా !అదీ నేనే చెప్పాలా!"అంది రాధిక
అదికాదే నువ్వైతే నాకేది నచ్చుతుందో కరెక్ట్ గా చెప్పగలవు.నాకేది ఇష్టమో నాకే తెలియదు"అంది బుంగమూతి పెట్టి నీలహంస.
"ఏమండోయ్ నీలహంసగారు చూడబోతే మీకు కాబోయే వాడిని కూడా మీ ఫ్రెండే సెలెక్ట్ చెయ్యలనేట్టు ఉన్నారే? "అంది అపర్ణ.
అందరూ గొల్లున నవ్వారు.పాపం నీలహంస సిగ్గుపడిపోతూ రాధికని గిల్లుతూ" ఎందుకే ఇంత రాద్ధాంతం చేశావూ ..ఉండు ఇంక నిన్నేమైనా అడుగుతానేమో చూడు "అంది.
"అయ్యో అపర్ణ గారు దానికి ఇంకా అమాయకత్వం పోలేదు.అన్ని నన్నే అడుగుతుంది.తొందరగా చిన్న బుచ్చుకుంటుంది "అందిరాధిక .
" అయ్యో సరదాకి అన్నానండి నీలహంసగారు సారీ "అంది అపర్ణ." ఫరవాలేదండీ "అంది నీలహంస.
అలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు.ఇంక అపర్ణ కబుర్ల నిండా వాళ్ళ బావ సురేంద్ర మీద అభిమానం ఆప్యాయత కనిపిస్తున్నాయి.ఆమె మాటల ద్వారా సురేంద్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేసేసుకున్నారు అమ్మాయిలు.
మద్యాహ్నం ఒంటిగంట కల్లా భోజనాలకి అందరూ కలిసారు.అప్పుడు అమ్మాయిలు సురేంద్ర ని తేరిపార చూసారు.అపర్ణ మాటల్లో సురేంద్ర ని ఇక్కడ సురేంద్ర ని కంపేర్ చేసుకుంటున్నారు.సురేంద్ర అందరితో కలివిడిగా మాట్లాడుతూ భోజనం చేస్తున్నాడు.రెండు కళ్ళు తననే గమనిస్తున్నాయని గుర్తించలేదతడు .భోజనాలయ్యాయి.మద్యాహ్నం మూడు గంటలకి లెక్చరర్ తొ కలిసి పొలాలవైపు వెళ్ళారు విద్యార్థులు ,కావలసిన నోటుపుస్తకాలు పట్టుకొని. అలా ప్రారంభమైన వాళ్ళ ఫీల్డ్ వర్క్ రోజూ ఉదయం టిఫిన్ల దగ్గర, భోజనాల దగ్గర తప్ప మిగతా సమయమంతా వ్రాసుకొనే పనిలో బిజీ అయిపోయింది .
కాలం విచిత్రమైనది.ఎక్కడెక్కడి వారినో ఒక్కటి చేస్తుంది.గత నాల్గురోజులుగా సురేంద్రకు దగ్గర దగ్గరగా ఉంటూ ఆ రెండు కళ్ళూ అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
5 వరోజు అందరూ టిఫిన్ల దగ్గర ఉన్నారు.సురేంద్ర లేడక్కడ.అందరూ అతనికోసం ఎదురు చూసారు.అప్పటిదాకా కళ్ళతోనే వెదుకుతున్న నీలహంస రాధికతో
" ఏమే అతను రాలేదేమిటీ? ఏమయ్యిందీ" అంది గుసగుసగా
."ఏమో నాకేం తెలుసు.అయినా నీకెందుకే ?"అంది రాధిక.
"అది కాదే రోజూ వచ్చేవాడుకదా అని ,అవును అపర్ణ కూడా లేదే! ఏమయింది "అని ఆత్రత పడిపోతోంది.ఇంతలో రంగారావుగారు "అయ్యో ఇంకా టిఫిన్లు చెయ్యలేదేమర్రా! ఓహో సురేంద్ర కోసమా ! తనకి కాస్త ఒంట్లో నలతగా ఉంటే ఇంటిదగ్గరే ఉన్నాడు.మా అమ్మ్మాయి వెళ్ళింది చూడ్డానికి.మీరు కానివ్వండి.బాగుంటే అలా పొలాల దగ్గరకి వచ్చేస్తాడు ,మీరు తిని బయలుదేరండి నేను బయటికి వెళ్తున్నాను "అని వెళ్ళిపోయారు .
" అయ్యో ఒంట్లో బాలేదా పాపం" అంది నీల హంస."అవునట సరే రా టిఫిన్ చేద్దాం"అంది రాధిక."లేదే నాకు తినాలనిలేదు నువ్వు తినేయి"అంది నీలహంస".ఏమిటే ఇప్పడి దాకా బాగానే ఉన్నావు కాదే ".
అబ్బే ఏమిలేదే తలనొప్పిగా ఉంది నేను ఈ పూట ఫీల్డ్ కి రాలేను "అంది నీలహంస
.రాధిక పెద్దగా గమనించలేదు."సరే అపర్ణ వస్తే తనదగ్గర ఉండు "అని టిఫిన్ చేసి వెళ్లి పోయిందిరాధిక.(సశేషం)

23 అక్టో, 2015

"ప్రేమంటే " కథ 2 వ భాగం

"ప్రేమంటే " కథ 2 వ భాగం

సురేంద్ర ఆ వూరిలో చదువుకున్న వాడు ,బుద్ధిమంతుడు. ఈ కాలం కుర్రాళ్ళల్లా అల్లరి చిల్లరగా తిరిగే రకం కాదు.ఎప్పుడూ పని, లేదంటే ఏవో పుస్తకాలు తిరగేస్తుంటాడు.
సురేంద్ర కి చిన్నతనంలోనే తల్లితండ్రి చనిపోతే మేనమామ రంగారావు(సర్పంచ్ ) పెంచి పెద్ద చేసాడు.చక్కగా చదువుకున్నాడు.ఏదైనా ఉద్యోగం చెయ్యమంటే లేదు నేను ఈ పల్లెటూరిలోనే ఉండి  వ్యవసాయం చేసుకుంటానన్నాడు.
చదువు పూర్తయ్యాక తన యింట్లో తనే ఉంటూ చేతనైనట్లు వొండుకు తింటుంటాడు.అత్త ఎంత చెప్పినా "ఇన్నాళ్ళూ నిన్ను శ్రమ పెట్టాను కదా అత్తా,నేనేమన్నా చిన్న పిల్లాడినా ,ఏదైనా అవసరమైతే అడుగుతానులే అంటాడు.పోనీలే నాయనా ! చక్కని పిల్లని చూసి పెళ్లన్నాచేసుకో అంటుంది. ఆవిడ మనసులో భావం వేరు. ఎదిగిన కూతురుంది.ఇంతకన్నా బుద్దిమంతుడిని తేలేము.ఉన్నది ఒక్కగా నొక్క కూతురే.ఇంకా సురేంద్ర మనస్సులో ఏముందో తెలియదు.మేనమామ కూతురు అపర్ణ అంటే మంచి అభిమానం.మేనమామకి చేదోడు వాదోడుగా ఉంటూ ఊరందరికీ తలలో నాల్కలా  ఉంటాడు సురేంద్ర.

బయటకి వెళ్ళాక చెప్పారు సర్పంచ్ రంగారావు గారు ఈ పిల్లలకి ఇక్కడ వ్యవసాయ సంబంధమైన కొన్ని విషయాలని తెలుసుకోవడానికి తన మిత్రుడి కాలేజీ నుండి ఇక్కడికి పంపారని, కొద్ది సేపట్లో వాళ్ళ గైడ్ లెక్చరర్ కూడా వస్తారని.వాళ్లకి సహాయంగా నువ్వుకూడా ఉండాలని."సరే" అన్నాడు సురేంద్ర.
మరోగంటకి వాళ్ళు ఇంటికి చేరేసరికి కాలేజ్ పిల్లలంతా చక్కగా తయారయ్యారు.అప్పటికే ఆలస్యమయ్యిందేమో ఆవురావురుమని టిఫిన్లు లాగించేస్తున్నారు.అందరికీ ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తున్నారు పనివాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు తల్లీకూతుళ్ళు అపర్ణ,భానుమతి గారు.
 ఇంతలో కాలేజ్ లెక్చరర్ నరసింహంగారు  కూడా వచ్చారు.అప్పుడు అంతాకలిసి అక్కడ వాళ్ళు చెయ్యబోయే వారం రోజుల కార్యక్రమం గురించి చర్చించు కున్నారు. సురేంద్ర సహకారాన్ని కూడా కోరారు.ఎలాగూ ఈ పూటకి ఆలస్యమయ్యింది కాబట్టి మద్యాహ్నం మూడుగంటల కల్లా అందరూ ఫీల్డ్ కి వెళ్లాలని నిర్ణయించారు....(సశేషం)

22 అక్టో, 2015

ప్రేమంటే

ప్రేమంటే
ప్రశాంతతకి,ప్రకృతి అందాలకిపల్లెటూళ్ళే పట్టుకొమ్మలు.అలాంటి ఓ పల్లెటూరు.పల్లె ఎప్పుడో నిద్ర లేచింది.సూర్యుడి నునులేత కిరణాలతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ నిద్రలేచాడు సురేంద్ర.ఎంత ఆలస్యంగా పడుకున్నా సూర్యోదయానికి లేవడం అలవాటు.లేస్తూనే అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళ పొలం వైపు వెళ్ళడం అలవాటు.దారిలో పెద్దవాళ్ళని మర్యాదపూర్వకంగా పలకరిస్తూతనని పలకరించిన వాళ్ళని పలకరిస్తూ వెళ్తున్నాడు.
తనకిఉన్న నాల్గు ఎకరాల పొలంలో కొన్ని కొబ్బరిచెట్లు,మామిడి చెట్లు పెంచుతున్నాడు.రకరకాల కూరగాయలు కూడా పండిస్తున్నాడు. పొలంలోకి వెళ్లి స్వయంగా ప్రతి మొక్కని పలకరిస్తున్నట్టుగా తిరుగుతాడు.ఒక గంట అక్కడ శారీరిక శ్రమ చేసి మరలా ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ గా డ్రెస్ చేసుకొని గ్రామంలో ఉండే లైబ్రేరీకి వచ్చి కాసేపు పత్రికలు తిరగేస్తాడు.అక్కడే ఓ గంట గడిపి మళ్ళా పొలం వైపు వెళ్తాడు.
అలా వెళ్తుంటే ఆరోజు ఒక కాలేజీ బస్ వచ్చి ఆగింది.అందులోంచి బిల బిల లాడుతూ ఓ ఇరవై మంది అమ్మాయిలూ అబ్బాయిలూ దిగారు.దిగుతూనే సురేంద్ర ని చూసి ఒక అబ్బాయి చొరవగా " సర్ మేము వి.వి.ఎం. కాలేజ్ నుండి ఫీల్డ్ వర్క్ మీద వచ్చాం.ఈ ఊరు సర్పంచ్ గారిని కలవాలి.మీరేమైనా సాయం చేయగలరా"- అన్నాడు. "సరే రండి సర్పంచిగారింటికి వెళ్దాం "అని బయలు దేరాడు
"రాధికా ఉండవే! నా లగేజ్ ఇంకా బస్ లోనే ఉంది. బస్ మళ్ళీ వెళ్లి పొతుందిగా ! ఒక్క నిముషం ఆగవే !" అంటూ ఒక అమ్మాయి అరిచింది."ఉన్నానే బాబూ ! మనం వచ్చింది పట్నానికి కాదు పల్లెటూరికి.బెంగ పడకు నెమ్మదిగా వెళ్ళచ్చు త్వరగా దింపుకో లగేజ్" అంది రాధిక
టీనేజ్ లో ఉన్న ఆపిల్లల్ని చూస్తుంటే స్వేచ్చగా ఎగిరే సీతాకోక చిలుకలని చూసినంత ఆహ్లాదంగా ఉంది.ఇందాకా పలకరించిన అబ్బాయితో "అవును ఇంతకీ నీ పేరు చెప్పలేదు ?అన్నాడు సురేంద్ర .
సారీ సార్ !నా పేరు విజయ్ .మేమంతా ఇక్కడ అగ్రికల్చర్ సైన్స్ సంబంధించి ఫీల్డ్ వర్క్ మీద వచ్చాము. మా ప్రిన్సిపాల్ గారికి మీ సర్పంచ్ గారు బాగా తెలుసట అందుకే లెటర్ ఇచ్చి పంపారు.ఇంతకీ మీ పేరు సర్ ... అన్నాడు ఆ అబ్బాయి.
ఓ.కే. విజయ్ నా పేరు సురేంద్ర.అదుగో సర్పంచ్ గారి ఇంటికి వచ్చేసాం.అంటూ మావయ్యా ..మావయ్యా అని గట్టిగా పిలిచాడు సురేంద్ర
"ఏరా ! ఏమిటి ఇలా దారితప్పి వచ్చావు? ఈ టైములో పొలంలో కదా ఉంటావు?"అంటూ ఓ 50 ఏళ్ల ఆసామి బయటికి వచ్చాడు.సాదాసీదాగా పంచెకట్టు కట్టుకొని బుర్ర మీసాలు సవరించుకొంటూ వస్తున్న ఆయన్ను చూసి అందరూ నమస్తే సార్ అన్నారు.
"ఓహో ఆదా సంగతి ఈ పిల్లకాయలు నీకు తగిలారు కాబట్టి ఇలా వచ్చావన్నమాట.అంతా బాగున్నారా బాబూ! మా రాజశేఖరం చెప్పాడు పిల్లకాయల్ని పంపుతున్నానని.మీరే అన్నమాట.సరే మీరిక్కడ ఉన్నన్నాళ్ళు మీ సొంత ఇల్లే అనుకుని ఉండండి.దేనికీ లోటు లేదు ఆడ పిల్లలు అదుగో ఆ కుడిపక్కనున్న ఇల్లు వాడుకోండి .మీకు సౌకర్యంగా ఉంటుంది.మగ పిల్లలు పక్కనే పంచాయతీ ఆఫీసు ఉంది అందులో నాల్గు గదులున్డాయి.అందులో సర్దుకోండి.ఇక కాఫీలు టిఫిన్లు అన్ని ఇక్కడికే వచ్చి చెయ్యల.స్నానాలకి అక్కడే ఏర్పాట్లున్నాయి.మరి ముందుగా కాస్త కాఫీలు పుచ్చుకొని అప్పుడు మీ గదుల్లోకి చేరండి" అని చెప్పి
"ఒరే పేరిగా ఈల్లందరికీ కాఫీలు తెచ్చి ఇయ్యరా ..అని" చెప్పు సురేంద్రా ఇంకేటి విశేషాలు రా అలా పొలానికి వెళ్తూ మాటాడుకుందాం"అని బయలు దేర దీసాడు.అందరూ థాంక్ యు సర్ అని సురేంద్ర కీ సర్పంచ్ గారికీ ఎంతో ఆనందంగా నమస్కరించారు.మీరు రెడీ అవండి మేము అలా వెళ్లి వస్తాము.అన్నారు సర్పంచ్ గారు (సశేషం )
Top of Form



5 జూన్, 2015

ఏమి తెలుసు ...



ఏమి తెలుసు .......

ఉదయానికి ఏమి తెలుసు చీకటిరాబోతుందని?
జననానికి ఏమితెలుసు మరణం పొంచి వుందని ?
పచ్చని పైరు కేమితెలుసు గొంతుకోయబడుతుందని ?
కెరటానికి ఏమి తెలుసు ఎగిసి కిందపడుతుందని?
జాబిల్లికి ఏమితెలుసు అమావాస్య అలుముకుంటుందని ?
గగనానికి ఏమితెలుసు నల్లమబ్బు కమ్ముకుంటుందని ?
అందానికి ఏమితెలుసు వార్ధక్యం వాటేస్తుందని ?
పూలబాలకేమితెలుసు చిరునగవు వాడిపోతుందని?
భూమాతకుఎమి తెలుసు గుండె చీలిపోతుందని?
వృక్షానికి ఏమితెలుసు ఆణువణువూ అంకితమివ్వాలని?