ఉదయకాంత నునులేత స్పర్శతో
కనులు తెరిచిన నాకు
ఉగాది వచ్చిందంటే
ఆశ్చర్యమేసింది
ఏది ?ఎక్కడ? అని ఇల్లంతా వెతికాను
ఎక్కడా కనిపించలేదు !
పెరిగిన ధరల ముసుగులో
తీపి,పులుపు ,ఉప్పు ,కారం
కాలుష్యపు కోరలలో
వేపపువ్వు ,మామిడికాయ
ముఖం చాటేసాయి
షడ్రుచులు నోరూరించే రుచులుకావని ,
షడ్చక్రం లో నలిగిన జీవనరసాలని ,
ఉగాది కావాలంటే ధనం గాది కావాలని ,
తెలియని పసిమనసుకు ఏదో రుచి చూపించి
ఇదే ఉగాది పచ్చడని ,ఉగాది వచ్చిందని ,
వచ్చి వెళ్లిపోయిందని
సర్ది చెప్పి ,సమాదానపరచుకొని
కాసేపలా కళ్ళు మూసుకున్న నాకు
కనులు తెరిచి చూస్తే
నిజంగానే ఉగాది వెళ్లి పోయింది !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి